Bride Rode a Horse During Her Wedding Procession తన పెళ్లికి గుర్రంపై మండపానికి వచ్చిన వధువు

Bride rode to groom s residence on horse in satna district of madhya pradesh

Indian Wedding, Big-fat indian wedding, bride riding horse, Deepa Valecha, Satna city, wedding procession, Madhya Pradesh, viral video

Deepa, who is the only daughter of the Valecha family fulfilled her wish to ride a horse on her wedding day, in support of her family, to the groom’s house in Kota. The event was not only special for the Valecha family but also for the society as Deepa, on this joyous occasion, gave out a strong message.

ITEMVIDEOS: వరుడు కాదు.. తన పెళ్లికి గుర్రంపై మండపానికి వచ్చిన వధువు

Posted: 02/09/2021 09:17 PM IST
Bride rode to groom s residence on horse in satna district of madhya pradesh

ఉత్తరాది పెళ్లి వేడకల్లో పెళ్లికొడుకు గుర్రంపై ఊరేగుతూ మండపానికి చేరుకోవడం సర్వసాధారణమైన విషయం. అయితే అబ్బాయిలే ఎందుకు.. అమ్మాయిలు ఇలా వస్తే ఎలా వుంటుంది.. అన్న అలోచన నూటికి 99 మంది వధువులకు రాదు. ఇక వచ్చిన ఒక్క శాతం మంది వధువులను వారి కుటుంబసభ్యులు వారించడమో.. నచ్చజెప్పడమో చేస్తుంటారు. కానీ అలాంటి కోరిక తనకు వుందని.. ధైర్యంగా తన తల్లిదండ్రులకు చెప్పడంతో పాటు వరుడి కుటుంబాన్ని ఒప్పించి.. అలా చేరుకుంది ఈ వధువు. అమె పేరే దీప.

సంప్రదాయానికి భిన్నంగా గుర్రాన్ని ఎక్కి తన బంధుజనమంతా వస్తుండగా.. వారి నడుమ ఊరేగుతూ వచ్చింది దీపా. ఈ భిన్నమైన ఘటన మధ్యప్రదేశ్ లోని సాట్నా జల్లాలో జరిగింది. అది కూడా పెళ్లిదుస్తుల్లో కాకుండా మోడ్రన్‌ దుస్తుల్లో వచ్చి ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియా నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాకు చెందిన దీపా వలేచా అనే యువతి వలేచా ఫ్యామిలీలోనే ఏకైక కూతురు. దీంతో చిన్పప్పటి నుంచి  ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన ఆమె తల్లిదండ్రులు గుర్రంపై స్వారీ చేయాలన్న తమ కూతురి కోరికను కూడా సంతోషంగా నెరవేర్చారు.

అంతేకాకుండా సమాజంలో ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదని, అబ్బాయిలకు సరిసమానంగా అమ్మాయిలకు కూడా సమాన హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. కూతురిపై అపారమైన ప్రేమతో పాటు ఆడవాళ్లు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించిన వలేచా పేరెంట్స్‌ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక పెళ్లిరోజు గుర్రపు స్వారీ చేసుకుంటూ రావాలన్న తన కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందని వధువు దీపా వలేచా పేర్కొంది. కుటుంబసభ్యుల వల్లే తన కోరిక నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles